27-03-2025 09:06:44 PM
కమాన్ పూర్ (విజయక్రాంతి): కమాన్పూర్ మండలంలోని ఇస్లాంనగర్ కి చెందిన మహమ్మద్ ముజాహిద్ మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్ధిళ్ల శ్రీనుబాబు గురువారం వారి పార్థివదేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని శ్రీనుబాబు తెలియజేశారు. శ్రీనుబాబు వెంట కాంగ్రెస్ పార్టీ మండల ప్రజా ప్రతినిధులు ఉన్నారు.