03-04-2025 08:30:55 PM
రామగిరి (విజయక్రాంతి): మండలంలోని రత్నాపూర్ (బేగంపేట్ ఎక్స్ రోడ్ గ్రామానికి చెందిన) యూత్ కాంగ్రెస్ నాయకులు, వాణి సోడా ఫ్యాక్టరీని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు దుదిళ్ల శ్రీనుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బండారి శివ, గిరవేన ప్రవీణ్, పాశం సాయిలకు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాప్పన్న, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.