calender_icon.png 17 March, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతున్న విజయ్ కి మెరుగైన వైద్యం అందించాలి

16-03-2025 08:00:51 PM

కరీంనగర్ లో పరామర్శలో దుద్దిళ్ల శ్రీను బాబు..

మంథని (విజయక్రాంతి): ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కరీంనగర్ లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రామగిరి మండలం నాగేపల్లికి చెందిన నేరెళ్ళ విజయ్ ని ఆదివారం హాస్పిటల్ లో మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకుడు వృద్ధుల శ్రీనుబాబు పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించి త్వరగా కోలుకునేల చూడాలని ఆయన సూచించారు.