calender_icon.png 31 March, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అడగగానే రైతులకు సబ్ స్టేషన్ మంజూరు చేసిన దుద్దిళ్ల శ్రీను బాబు

29-03-2025 01:16:15 AM

శాత్రాజ్ పల్లి లో సబ్ స్టేషన్ మంజూరు

ముత్తారం, ఓడేడు, పారుపల్లి రైతులకు వరం

ముత్తారం,(విజయక్రాంతి): అడగగానే సబ్ స్టేషన్ మంజూరు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు. ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాత్రాజ్ పల్లి లో సబ్ స్టేషన్ మంజూరు చేయాలని మాజీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్ రావు ముత్తారం లో నిర్వహించిన జై బాపు,  భిమ్, జై సంవిధన్ కార్యక్రమంలో శ్రీను బాబు ను కోరగా వెంటనే స్పందించిన శ్రీను బాబు ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో ఫోన్ లో మాట్లాడి శ్రీధర్ బాబు గారు అందరు చేయాలని కోరారు. ఈ సబ్ స్టేషన్ నిర్మాణంతో మండలంలోని ముత్తారం, ఓడేడు, పారుపల్లి, శాత్రాజ్ పల్లి, వెంకటేశ్వర్ల పల్లి రైతులకు వరం అని జగన్ మోహన్ రావు తెలిపారు. అడగగానే సబ్ స్టేషన్ మంజూరు చేయాలని అదేశించిన శ్రీను బాబు కు రైతుల పక్షాన  జగన్ మోహన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.