calender_icon.png 26 April, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతును రాజును చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

25-04-2025 05:32:22 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో దుద్దిళ్ల శ్రీను బాబు...

మంథని (విజయక్రాంతి): రైతును రాజు ను చేసేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మల్హర్ మండలం కొండంపేట గ్రామంలో పిఏసిఎస్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు దుద్దిళ్ళ శ్రీను బాబు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతుల సంక్షేమమే ద్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని, రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. వరి ధాన్యం విక్రయించే రైతులందరికి కనీస మద్దతు ధర ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి కొండ రాజమ్మ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.