29-03-2025 12:43:30 AM
సెంటీనరీ కాలనీ ఇఫ్తార్ విందులో దుద్దిళ్ల శ్రీనుబాబు
రామగిరి,(విజయక్రాంతి): కులమాతాలకు అతీతంగా సమాజంలోని అందరూ ప్రేమ, సౌహార్దంతో కలిసి ఉండాలని *సెంటీనరీ కాలనీ ఇఫ్తార్ విందులో దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. శుక్రవారం రామగిరి మండల కేంద్రంలోనీ సెంటీనరీ కాలనీ మస్జీద్ సమీపంలో మంథని నియోజవర్గ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ ముస్త్యల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు మోత్కూరి అవినాష్ గౌడ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వేడుకలలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరులు దుద్దిళ్ల శ్రీను బాబు పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ చేశారు. అనంతరం మౌలాన అలీ చే సర్వమానావవళి శాంతి, ఐక్యత, అభివృద్ధి కోసం ప్రత్యేక దువా నిర్వహించగా శ్రీను బాబు భక్తిపూర్వకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని, కులమాతాలకు అతీతంగా సమాజంలోని ప్రజలందరూ కలిసి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల ముస్లిం సోదరులు, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.