27-02-2025 03:21:17 PM
కాటారం,(విజయక్రాంతి): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి అలాగే టీచర్స్ ఎమ్మెల్సీ(Teachers MLC Election) స్థానానికి జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) సహోదరుడు, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు దుద్దిల్ల శ్రీను బాబు(Duddilla srinu babu) పరిశీలించారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహా ముత్తారం మండలాల్లో శ్రీనుబాబు విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉట్కూరి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున సమాయత్తమయ్యారు. మహాముత్తారంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగమల్ల దుర్గయ్య, మాజీ జెడ్పిటిసి లింగమల్ల శారద, మాజీ సర్పంచ్ లు బెల్లంకొండ కిష్టయ్య, గంటా దేవేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రాం నారాయణ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాటారం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమునూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చీమల సందీప్, ఓ బి సి అధ్యక్షులు కొట్టే ప్రభాకర్, కొట్టే శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్ , కడారీ విక్రమ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జాడి మహేశ్వరి, యూత్ కాంగ్రెస్ నాయకులు సుందిళ్ల ప్రభుదాస్, పసుల మొగిలి, తదితరులు పాల్గొన్నారు.