ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండలంలోని పోతారం గ్రామంలో బాధిత కుటుంబాలను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు ఆదివారం పరామర్శించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చెలుకల జితేందర్ యాదవ్ తల్లి పాపమ్మ మృతిచెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బండ రామకృష్ణ ఇటీవల ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రామగిరి మండలంలోని ఆదివారం పేటలో ముత్తారం మాజీ జడ్పిటిసి మైదం భారతి వరప్రసాద్ తల్లి మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆమె మృతికి గల కారణాలను మైదం వరప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ముత్తారం మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, నాయకులు మద్దెల రాజయ్య, చెలుకల సుధీర్ యాదవ్, దాసరి చంద్రమౌళి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.