హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘కంగువా’. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఫాంటసీ యాక్షన్ జానర్‌లో ఈ సినిమా రూపొందింది. కంగువా గురించి నిర్మాత జ్ఞానవేల్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాజాగా ఎక్స్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన జ్ఞానవేల్ సినిమాలో ఏఐని ఉపయోగించినట్టు తెలి పారు.
8 భాషల్లో రూపొందిన ‘కంగువా’కు తమిళ్‌లో సూర్య డబ్బింగ్ చెప్పారు. ఇక మిగిలిన 7 భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఇలా డబ్బింగ్ కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారి. ‘వేట్టయన్’ మూవీలో అమితాబ్ బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం వినియోగించారు కానీ పాక్షికంగా మాత్రమే. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏఐని ఉపయోగించడం ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రం నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.