calender_icon.png 22 October, 2024 | 8:30 AM

డబ్బింగ్ కష్టమనిపించింది

20-10-2024 12:00:00 AM

వచంద్రకృష్ణ, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘పొట్టేల్’. సాహిత్ మోత్కూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ పతాకాలపై నిశాంక్‌రెడ్డి కుడితి, సురేశ్‌కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటుడు అజయ్ ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అజయ్ మీడియా సమావేశంలో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

పొట్టేల్’ జర్నీ ఎలా ప్రారంభమైంది?

చిత్ర దర్శకుడు సాహిత్ కథ చెబుతుంటే క్యాజువల్‌గా విన్నాను. రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ తప్పకుండా చేయాలనిపించింది. ఇది మల్టీ లేయర్ కథ. కూతురి చదువు కోసం తండ్రి పోరాటం నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఇందులో విజిల్స్ పడే సీన్స్ చాలానే ఉంటాయి. 

క్యారెక్టర్ కోసం ఎలాంటి వర్క్ చేశారు? 

ముఖ్యంగా కథే నన్ను ఈ సినిమా చేయడానికి ఎక్సైట్ చేసింది. తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. సాహిత్ నేటివ్ నిర్మల్ కావడంతో డైలాగ్ తన స్లాంగ్‌లో రాశాడు. డబ్బింగ్ కొంచెం కష్టమనిపించింది. ఈ సినిమాలో కల్చర్‌ని ప్రజెంట్ చేయ డం కోసం కష్టపడ్డాను. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు ఒంటి మీదకు రావడం. అది వచ్చినప్పుడు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. దానికోసం డైరెక్టర్, నేను చాలా ఎఫర్ట్ పెట్టాం. 

విక్రమార్కుడి తర్వాత పొట్టేల్‌లో పాత్ర నచ్చిందని చెప్పడానికి కారణం?  

-విక్రమార్కుడు తర్వాత అంతటి టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చాయి. టిట్ల వంటి పాత్రలు రెగ్యులర్‌గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. నాకు నచ్చి న పాత్ర దొరికిందని పొట్టేల్ గురించి చెప్పా ను. నటుడిగా సంతోషాన్నిచ్చిన పాత్ర ఇది. 

ఈ సినిమాలో మూఢనమ్మకాల గురించి ఉంటుందా? 

-మూఢనమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకు ని బతికే మనుషులు,  మొండితనం, గ్రామదేవతల గురించి.. ఇలా మల్టీ లేయర్స్‌లో సినిమా ఉంటుంది.