హీరో రామ్‌చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబోలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ పతాకాలపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. ఈ చిత్రాన్ని వచ్చే క్రిస్మస్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఆమధ్య రామ్‌చరణ్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయగా, డైరెక్టర్ శంకర్ మిగతా చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇలా షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతున్న చిత్రబృందం తాజాగా డబ్బింగ్ పనులు షురూ చేసింది.
బుధవారం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అంజలి, సముద్రఖని, ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర తదితర ముఖ్య తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు; డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా; ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్ల; యాక్షన్ కొరియోగ్రఫీ: అన్బరివు; డాన్స్ కొరియోగ్రఫీ: ప్రభుదేవా, గణేశ్ ఆచార్య, ప్రేమ్ రక్షిత్, బాస్కో మార్టిస్, జానీ, శాండీ; పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, కాసర్ల శ్యామ్.