calender_icon.png 29 October, 2024 | 8:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్బింగ్ మొదలైంది!

28-10-2024 12:00:00 AM

హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ ‘వెంకీఅనిల్03’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్ వెంకటేశ్ భార్య పాత్రలో నటిస్తుం డగా, ఆయన మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి కనిపించ నుంది. ఉపేంద్ర లిమాయే, రాజేంద్రప్రసాద్, సాయికుమా ర్, నరేశ్, వీటీ గణేశ్, మురళీధర్‌గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేశ్ బాలరాజ్, ప్రదీప్ కాబ్రా, చిట్టి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు 90 శాతం షూటింగ్ పార్ట్ పూర్తయింది. దీంతో తాజాగా టీమ్ డబ్బింగ్ కార్యక్రమాలను ప్రారంభించింది. డబ్బింగ్ స్టూడియో నుంచి రిలీజ్ చేసిన ఓ వీడియో చూస్తే.. అక్కడ ఇప్పుడే సంక్రాంతి పండుగ నెలకొన్నట్టు తెలుస్తోంది.

అన్నట్టూ.. ఈ సినిమాను కూడా 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి; యాక్షన్ కొరియోగ్రఫీ: వీ వెంకట్; స్క్రీన్‌ప్లే: ఎస్ కృష్ణ, జీ ఆదినారాయణ.