సిద్దిపేట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి)/దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్‌ఐ మన్యం నర్సింహరెడ్డి లంచం తీసుకుంటూ బుధవారం ఏసీబీకి చిక్కాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన కుంభం రాజిరెడ్డి 3.25 ఎకరాల భూమి కొన్నాడు. పట్టా మార్పునకు దు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు.
పట్టా మార్పునకు ఆర్‌ఐ నర్సింహరెడ్డి రూ.లక్ష డిమాండ్ చేశాడు. దీంతో రాజిరెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. బుధవారం సిద్దిపేట జిల్లా కేం బీజేఆర్ చౌరస్తా సమీపంలోని ఓ దుకాణంలో రూ.లక్ష తీసుకుంటుండగా ఆర్‌ఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం దుబ్బాకలోని ఆర్‌ఐ నివాసంలో సోదాలు చేశారు.