calender_icon.png 26 November, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటానికి స్ఫూర్తి చాకలి ఐలమ్మ

26-09-2024 12:11:47 PM

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక (విజయక్రాంతి): నాటి తెలంగాణ సాయుధ పోరాట వీర వనిత, చిట్యాల (చాకలి) ఐలమ్మ, బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని దుబ్బాక శాసనసభ్యులు, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం దుబ్బాకలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయన్నారు.

హక్కులకోసం ఐలమ్మ చేసిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తితో తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి  సాగించిందన్నారు. ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను కెసిఆర్ హయాంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ సబ్బండ వర్గాల త్యాగాలను ప్రజలు స్మరించుకునేలా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్మన్ గన్నే వనిత భూంరెడ్డి, మాజీ జడ్పీటీసీ రవీందర్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు పల్లె వంశీకృష్ణగౌడ్, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.