దుబ్బాక ఆర్టీసీ డిపో ముందు భూమి పూజ చేస్తున్న బిఆర్ఎస్ నాయకులు
దుబ్బాక (విజయక్రాంతి): దుబ్బాక నియోజకవర్గన్ని అభివృద్ధిలో ముందుకు నడిపిన దుబ్బాక బి అర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి విగ్రహనికి స్థానిక బస్టాండ్ వద్ద బి అర్ ఎస్ నాయకులు భూమి పూజ చేశారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతు మాజీఎమ్మెల్యే గరీబోళ్ల బిడ్డ ఉంటే ప్రజల్లో ఉండాలి లేదా పాడమీదే ఉండాలని ఒక నినాదంతో తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజల కోసం సేవలు అందించారని తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి కడతల రవీందర్ రెడ్డి బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రొట్టె రాజమౌళి పంతులు జిల్లా ఉపాధ్యక్షులు గుండవెల్లి ఎల్లారెడ్డి కోఆప్షన్ సభ్యులు ఆసస్వామి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రామస్వామి గౌడ్, గన్నెబూమిరెడ్డి పర్సకృష్ణ ఒగ్గు రాములు టిఆర్ఎస్ పార్టీ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు