18-04-2025 09:26:25 PM
11వేల నగదు అందజేత
పాపన్నపేట: తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు దుబ్బాక శ్రీ సద్గురు స్వామీ సమర్థ మహారాజ్ ఆర్థిక చేయూత అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బుధవారం రోజున విజయక్రాంతి దినపత్రికలో తనువు చాలించిన తండ్రి... అనాధలను చేసిన తల్లి అనే శీర్షిక తో ప్రత్యేక కథనం వెలువడింది.. దీనికి స్పందించిన దుబ్బాక శ్రీ సద్గురు స్వామీ సమర్థ మహారాజ్ శుక్రవారం కుర్తివాడ గ్రామానికి చెందిన ముగ్గురు అనాధ పిల్లలకు రూ.11,000/- ఆర్ధిక సహయాన్ని పంపించారు. ఆశ్రమము తరపున కొత్త విషాంత్ గుప్తా ఈ నగదును పిల్లలకు అందించారు. పిల్లల పరిస్థితిని గుర్తించి సహాయాన్ని అందించిన శ్రీ సద్గురు స్వామీ సమర్ధ మహరాజ్ కు గ్రామ నాయకులు కొత్తూరి శ్రీనివాస్, మధుసుధన్ చారితో పాటు పిల్లల మేనత్త లక్ష్మి, బావ కమలాకర్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.