calender_icon.png 6 October, 2024 | 6:10 AM

ఢిల్లీ డ్రగ్స్ కేసుకు దుబాయ్ మూలాలు!

06-10-2024 01:24:38 AM

ప్రధాన నిందితుడు తుషార్ గోయల్‌కు దుబాయ్, లండన్ పెడ్లర్లతో లింకులు

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: ఢిల్లీ డ్రగ్స్ రాకెట్‌లో పట్టుబడిన ప్రధాన నిందుతుడు తుషార్ గోయల్‌కు అంతర్జాతీ య డ్రగ్స్ పెడ్లర్లతో సంబంధాలు ఉన్న ట్లు పోలీసుల విచారణలో తేలింది. విచారణలో భాగంగా తుషార్.. 2023 లో పుణెలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుబడిన కేసులో నిం దితుడైన బసోయా పేరును ప్రస్తావించాడు.

కాగా బసోయా అదే ఏడాది దుబాయ్‌కి చెక్కేశాడని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచే అతడు డ్రగ్స్ సిం డికేట్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో పట్టుబడిని 5 వేల కోట్ల విలువైన డ్రగ్స్ కేసుకు సంబంధించి ఐదో నిందితుడైన జితేంద్రపాల్‌సింగ్ అలియాస్ జెస్సీ గురు వారం యూకే పారిపోతుండగా అమృత్‌సర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా సంబంధా లు ఉండటంతో పాటు దుబాయ్, లండన్‌లోనూ నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

వివిధ మార్గాల్లో ఢిల్లీకి డ్రగ్స్..

కొకైన్‌ను వివిధ రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గంలో ఢిల్లీకి స్మగ్లింగ్ చేయ గా.. గంజాయి థాయిలాండ్‌లోని పెకెట్ నుంచి అక్రమంగా తరలించేవారు. లావాదేవీలకు సంబంధించి నిందితులు క్రిప్టో కరెన్సీని వినియోగించినట్లు సమాచారం. డ్రగ్ కార్టెల్‌కు సంబంధించి కింగ్‌పిన్ పశ్చిమాసియా దేశం నుంచి భారత్‌లో తన కార్యకలాపాలను నడుపుతున్నాడు అని ఓ సీని యర్ ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు.

సిండికేట్‌లో ప్రమేయం ఉన్న అనుమానితులందరినీ ట్రాక్ చేసి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.  కాగా ఇప్పటికే  కేసులో ప్రధాన నిందితుడైన గోయల్‌తో పాటు మరో ముగ్గిరిని (హిమాన్షు కుమార్, ఔరంగజేబ్ సిద్దీఖీ, భరత కుమార్ జైన్) పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మరో నిందితుడు జెస్సీ దేశం దాటి వెళ్తున్న క్రమంలో అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.