15-02-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే అగ్రరాజ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిం చారు టారిఫ్‌ల విషయంలో ఎలాంటి హామీలను పొందలేకపోయినా ఇరుదేశాల మైత్రీబంధాన్ని బలోపేతం చేసుకోవడంలో మాత్రం విజయవంతమయింది. రెండురోజుల అమెరికా పర్యటనలో మోదీకి లభించిన స్వాగ తం, ప్రియమిత్రుడు ట్రంప్ గతంలోలాగే ప్రధానిపై చూపిన ప్రేమాభిమానాలు, ఇరువురు నేతల చర్చలో ్లకుదిరిన రక్షణ పరికరాల ఒప్పం దాలు, మీడియా సమావేశంలో ఒకరిపై మరొకరు కురిపించుకున్న ప్రశంసలు అన్నీ ఊహించినవే. అయితే భారత్‌కు ట్రంప్ ఎఫ్35 యుద్ధ విమా నాలను ఆఫర్ చేయడం సంచలనంగా మారింది.
అత్యాధునిక సాంకేతికత తో అభివృద్ధి చేసిన ఈ ఫైటర్ జెట్‌ను ఎంతో సన్నిహిత దేశాలకు కూడా అమెరికా ఇవ్వాలనుకోవడం లేదు. రష్యానుంచి ఎస్ 400 మిస్సైల్ సిస్టమ్‌ను కొనుగోలు చేసిందని, నాటో సభ్య దేశమైన టర్కీకి కూడా వీటిని అమ్మబోమని గతంలో తేల్చి చెప్పింది. అలాంటిది ఎస్ 400 సిస్టమ్‌ను వాడుతున్న భారత్‌కు వీటిని అమ్మాలనుకోవడం విశేషం. అలాగే ముంబ యి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రెహమాన్‌నే కాకుండా మరికొందరిని కూడా భారత్‌కు అప్పజెబుతామని ప్రకటించడం విశేషం. ఇవి రెండూ మోదీ పర్యటన సాధించిన విజయాలే. రాణాను తమకు అప్పజెప్పాలిందిగా భారత్ చాలాకాలంగా అమెరికాను కోరుతున్నా బైడెన్ హయాంలో జరగలేదు.
అలాగే రక్షణ సహకారాన్ని బలోఓపేతం చేసుకునేందుకు పదేళ్ల ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ఇరువురు నేతలు ప్రకటించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు, రక్షణరంగంలో పరస్పర సహకారంపై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చించినట్లు చెబుతున్నారు. వాణిజ్య వివాదాలపై అంతగా పురోగతి కనిపించకపోయినప్పటికీ ఇరువురు నేతలు వ్యూహాత్మక సంబంధాలు, పరస్పర భౌగోళిక, రాజకీయ ప్రయోజనాలపై తమ నిబద్ధతను చాటి చెప్పేందుకు ఈ భేటీని ఉపయోగించుకున్నారని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అయితే మోదీతో భేటీకి కొద్దిగంటల ముందు ట్రంప్ చేసిన ప్రకటనలతో ప్రతీకార సుంకాల విషయంలో ఆయన విధానంలో మార్పులేదని స్పష్టమయింది.
అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక పన్నులు విధిస్తోందని గతంలోనే ఆరోపించిన ట్రంప్ ఇప్పుడు మిత్ర దేశమైనా, వేరే దేశమయినా సరే అవి విధించే సుంకాలకు సమానంగా ప్రతీకార సుంకాలు ఉంటాయని స్పష్టం చేశారు. అంటే అమెరికానుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై భారత్ ఇప్పుడు 10 శాతం దాకా సంకాలు విధిస్తోంది. అదే సమయంలో భారతీయ వస్తువులపై అమెరికా తక్కువ శాతం సుంకం విధిస్తోంది. ఇప్పుడు అమెరికా కూడా అదే స్థాయిలో సుంకాలు విధించడం ఖాయం.
దీంతో భారత్‌నుంచి అమెరికాకు భారీ మొత్తంలో ఎగుమతి అవుతున్న టెక్స్‌టైల్, ఫార్మా ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరిగిపోనున్నాయి. మన ఎగుమతులకు ఇది పెద్దదెబ్బే. ఈ అంతరాన్ని తగ్గించడం కోసమే అమెరికానుంచి మన దేశం రక్షణ ఉత్పత్తులతో పాటుగా పెట్రోల్, గ్యాస్ లాంటివి కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు చెబుతున్నారు.దీర్ఘకాలికంగా ఇది ఇరు దేశాలకు ప్రయోజనం చేకూరుస్తుంది.
ఇక మోదీ అమెరికాలో ఉన్న సమయంలోనే అక్రమ వలసదారులు 200 మందిని భారత్‌కు తిప్పి పంపుతున్నట్లు అమెరికా ప్రకటించడం విశేషం. ఇదే విషయాన్ని మీడియా సమావేశంలో అడగ్గా అక్రమ వలసదారులను వెనక్కి తీసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని మోదీ స్పష్టం చేశారు. అంతేకాదు ఇది ప్రపంచ దేశాలకన్నిటికీ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కాగా గతంలో మాదిరిగానే అమెరికా తన విధానాలను ఒకరి కోసంమార్చుకోదని, దేశ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరిస్తుందని మరోసారి స్పష్టమయింది.
మోదీ అమెరికా పర్యటన ్ల ఇరుదేశాల బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి దోహదపడింది. మోదీ పర్యటనపై ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉన్నా ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చారు.