calender_icon.png 13 January, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన డీటీసీవో

01-08-2024 04:19:35 AM

2 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (విజయక్రాంతి): ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. పంజాగుట్ట సర్కిల్ హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్‌రెడ్డి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికి పోయాడు. ఒక ప్రైవేట్ సంస్థకు సంబంధించిన ఆడిట్ పూర్తి చేయడానికి ఆ సంస్థ యజమాని నుంచి రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ రైడ్స్‌కు సంబంధించిన వివరాలను రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ మీడియాకు వెల్లడిం చారు.

ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. అతని కంపెనీకి చెందిన ఆస్తులను మూడేళ్లకుగాను లెక్కిం పు చేయించేందుకు పంజాగుట్ట సర్కిల్‌కు చెందిన డీటీసీవో శ్రీధర్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, అతను సమర్పించిన ఫార్మాట్ సరిగా లేదంటూ శ్రీకాంత్‌కు శ్రీధర్ షోకాజ్ నోటీసులు పంపించాడు. ఆ నోటీసుకుగాను అన్ని డాక్యుమెంట్స్ సరిగ్గానే అందజేశా మని శ్రీకాంత్ అధికారికి బదులిచ్చాడు. అయినప్పటికీ లెక్కింపు చేయాలంటే తనకు రూ. 3 లక్షలు లంచం ఇవ్వా లని శ్రీధర్ డిమాండ్ చేశాడు. అంత డబ్బు ఇచ్చుకోలేనని శ్రీకాంత్ తెలపగా, రూ. 2 లక్షలు ఇవ్వడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. 

దీనిపై శ్రీకాంత్ ఏసీబీకీ సమాచారం అందించాడు. దీంతో అబిడ్స్‌లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో రూ. 2 లక్షలు లంచం తీసుకుంటుండగా బుధవారం శ్రీధర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన అధికారులు, నాంపల్లి కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు.