calender_icon.png 9 February, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీటీసీకి రూ.15 కోట్ల అక్రమాస్తులు?

09-02-2025 12:00:00 AM

  1. రూ.5 లక్షల విలువైన విదేశీ మద్యం
  2. శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన ఏసీబీ

జనగామ, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ అధికారి(డీటీసీ) డాక్టర్ పుప్పాల శ్రీని  సుమారు రూ.15 కోట్ల అక్రమాస్తులతో పాటు తన ఇంట్లో రూ.5 లక్షల విలు  విదేశీ మద్యం బాటిళ్లను గుర్తించిన ఏసీ  అధికారులు శనివారం అరెస్టు చేశారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన కేసు నమోదు చేశారు. 

హన్మకొండ పలివేల్పులలోని శ్రీనివాస్ నివా  పాటు భీమారంలోని ఆర్‌టీఏ కార్యాలయం, హైదరాద్‌లోని నివాసం, జగిత్యాల, కరీంనగర్‌లోని ఆయన బంధువుల ఇళ్లలో శుక్రవారం ఏసీబీ ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్‌లోని విల్లాలతో పాటు పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

ఈ సోదాల్లో రూ.5 లక్షల విలువైన ఫారిన్ లిక్కర్ కూడా లభ్యం కావడం గమనార్హం. శ్రీనివాస్‌ను పది గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. శనివారం శ్రీని  వరంగల్ ఏసీబీ కోర్టులో రిమాండ్ చేశారు. ఏడాది క్రితం వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన పుప్పాల శ్రీనివాస్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన రూ.15 కోట్లకు పైగా అక్ర  కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో 15 ఎకరాల వ్యవసాయ భూమి, 16 ఓపెన్ ప్లాట్లు అక్రమంగా సంపాదించినట్లు తెలిసింది.