calender_icon.png 31 January, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీటీ లక్ష్మీకాంత్‌కు ఉత్తమ ఉద్యోగి గుర్తింపు

27-01-2025 12:26:05 AM

పెబ్బేరు, జనవరి 26: 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పలువురికి జిల్లా ఉత్తమ ఉద్యోగి గుర్తింపు అవార్డులను ప్రధానం చేశారు. అందులో భాగంగా పెబ్బేరు తహసీల్దార్ కార్యాలయంలో లక్ష్మీకాంత్ ఉప తహసీల్దార్ గా విధులు నిర్వహిస్తున్నారు.

అత్యుత్తమ పనితీరును గుర్తించి జిల్లా ఉత్తమ ఉద్యోగి గుర్తింపు అవార్డును జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా పెబ్బేరు తహసీల్దార్ లక్ష్మీ, కార్యాలయ సిబ్బంది, నాయకులు, స్నేహితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.