calender_icon.png 26 December, 2024 | 7:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన డీఎస్పీ వెంకటరెడ్డి

08-11-2024 03:14:25 PM

వెల్దుర్తి (విజయక్రాంతి): మెదక్ జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, సిఐ రంగా కృష్ణ, అనంతరం స్టేషన్ లో ఉన్న పలు రికార్డులను, ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ ఐ ఆర్ లను, స్టేషన్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మండలం ఉన్న ప్రతి గ్రామంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాలు ద్వారా దొంగతనాలు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. కొన్ని గ్రామాల్లో పనిచేయని సీసీ కెమెరాలను రిపేరు చేయించుకోవాలని ఆయన సూచించారు. ఈ మధ్యన మండలం జరిగిన దొంగతనాల త్వరలోనే చేదించి దొంగలను తొందర్లోనే పట్టుకుంటామని మీడియాతో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సి ఐ రంగా కృష్ణ, ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.