27-02-2025 03:42:53 PM
చిట్యాల : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు(DSP Sampath Rao) పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఏలాంటి అల్లర్లకు తావు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. పోలింగ్ కేంద్రంలో ఏలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. ప్రస్తుతానికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని తెలిపారు.ఆయన వెంట చిట్యాల సిఐ దగ్గు మల్లేష్ యాదవ్, ఎస్ఐ శ్రావణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు