11-02-2025 01:57:09 PM
మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమల్ల గ్రామంలో మణుగూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్ రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా తిరుమల గ్రామంలో వైభవంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర(Sammakka Saralamma Jathra) ప్రాంతాన్ని సందర్శించారు. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా చేపడుతున్న పనులను పరిశీలించి జాతర సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు దగ్గరుండి పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు సిబ్బందికి సూచించారు. అనంతరం ఆలయ పూజారులతో జాతర వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర పరిసర ప్రాంతాలను పరిశీలించారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రాజేందర్, ఈ బయ్యారం ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.