calender_icon.png 27 February, 2025 | 7:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన డిఎస్పి రవీందర్ రెడ్డి

27-02-2025 03:36:30 PM

మణుగూరు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సబ్ డివిజన్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను గురువారం మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి తనిఖీ చేశారు. మణుగూరు పినపాక కరకగూడెం మండలాల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఎన్నికల పోలింగ్ సరళని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న సిఐలను ఎస్ఐలను అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో ఆయా మండలాల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు