22-04-2025 04:52:18 PM
మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండల పోలీస్ స్టేషన్ ను కాటారం డిఎస్పి రామ్మోహన్ రెడ్డి(DSP Rammohan Reddy) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పోలీస్ స్టేషన్ సిబ్బంది చేస్తున్నటువంటి విధులను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ కి సంబంధించినా రికార్డ్స్ ను పరిశీంచడం జరిగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో జాగ్రత్తగా ఉండాలి అని, గోదావరి తీరప్రాంత గ్రామాలు, మావోయిస్టులు దాటడానికి అనుకూలంగా ఉన్న గోదావరి ఫెర్రీ పాయింట్లు అయినటువంటి సర్వాయిపేట, దమ్మూరు, బూరుగు గూడెం, నీలం పల్లి, బండారి గూడెం, ముకునూర్ వంటి గ్రామాలను ఆనుకొని ఉన్న ఫెర్రీ పాయింట్లకు సంబంధిన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
మావోయిస్టులు దాటడానికి అనుకూలంగా ఉన్న ఫెర్రీ పాయింట్ ల పైన నిరంతర నిఘా ఉండాలని పలిమెల ఎస్సైకి సూచించారు. విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముకునుర్, పలిమెల గుత్తి కోయ గూడెంలోని గుత్తి కోయల గురించి మాట్లాడుతూ... వారి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో మహదేవ్ పూర్ సీఐ రామచందర్ రావు, పలిమెల ఎస్సై రమేష్ ఇతర పోలీస్ అధికారులు, సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.