calender_icon.png 19 April, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుమతులు లేకుండా విగ్రహాలను పెట్టకూడదు : డీఎస్పీ ప్రసన్నకుమార్

18-04-2025 09:38:38 PM

కొల్చారం,(విజయ క్రాంతి):  కొల్చారం మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా కొల్చారం గ్రామానికి వెళ్లే దారి మధ్యలో విగ్రహ ఏర్పాటు చేయడంతో అదే దారిలో విగ్రహానికి ముందుగా చత్రపతి శివాజీ జెండా ఏర్పాటు చేయడంతో ఇరు వర్గాల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ విషయమై శుక్రవారం నాడు మరోమారు విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. సంబంధిత స్థలంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా కొల్చారం పోలీస్ స్టేషన్ లో డిఎస్పి ప్రసన్న కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏప్రిల్ 13 నాడు రాత్రి జాతీయ రహదారికి అనుకొని ఉన్న కొల్చారం గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గం మధ్యలో విగ్రహ ఏర్పాటు రాత్రికి రాత్రి ఏర్పాట్లు చేయగా మరుసటి రోజు మరో విగ్రహ ఏర్పాటులో భాగంగా 10 మీటర్ల దూరంలో మరో విగ్రహానికి సంబంధించిన జెండాను ఏర్పాటు చేయగా ఇది చట్ట విరుద్ధమైన పని అని ఇరువర్గాలను సంబంధించిన విగ్రహాన్ని, జెండాను తీసివేయాలని చెప్పడం జరిగింది. ఈ విషయానికి సంబంధించి స్థానిక తహసిల్దార్ ఫిర్యాదు చేస్తారని ఈ ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు.

ఎవరైనా విగ్రహాలను ఏర్పాటు చేయాలంటే కమిటీ ఏర్పాటు తప్పనిసరి అని కమిటీలో కలెక్టర్, ఎస్పీ, మున్సిపాలిటీలో అయితే కమిషనర్ గ్రామపంచాయతీలో అయితే గ్రామపంచాయతీ జిల్లా అధికారులు ఉంటారని వారి అనుమతితో విగ్రహాలను ఏర్పాటు చేయాలని గ్రామాలలో అవగాహన లోపంతో అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ రోడ్డు మార్గాన విగ్రహాలను  ఏర్పాటు చేయడంతో రోడ్డు మార్గానికి ఆటంకం ఏర్పడుతుంది. ప్రజలు తెలుసుకోవాల్సిందని ఏంటంటే ఏవైనా విగ్రహాలు పెట్టాలంటే కచ్చితంగా అనుమతులు తీసుకోవాలన్నారు.

అనుమతులు తీసుకోకపోతే సంబంధిత అధికారితో ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయడం జరుగుతుందని ప్రజలు దయచేసి గమనించాలని చిన్న చిన్న విషయాలే పెద్దవిగా  కాకముందే ప్రజలు అప్రమత్తంగా ఉండి ఇట్టి విషయాలను పోలీసు దృష్టికి తీసుకురావాలని వెంటనే చర్యలు  తీసుకొని విగ్రహాలను పెట్టకముందే తీసివేసే అవకాశం ఉంటుందని రాత్రికి రాత్రి ఇటువంటి కార్యక్రమాలు లు చేయడం సరైనది కాదని ఈ విషయంలో పోలీస్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని  గ్రామ పెద్దలు ఈ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో సహకరించి ప్రోత్సహించరాదని అన్నారు. కార్యక్రమంలో సిఐ రాజశేఖర్ రెడ్డి,  ఎస్సై మహమ్మద్ గౌస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.