calender_icon.png 3 April, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లా వాసికి డిఎస్పి ఉద్యోగం

01-04-2025 10:59:21 PM

గ్రూప్ వన్ లో 67వ ర్యాంక్..

కామారెడ్డి (విజయక్రాంతి): గ్రూప్ వన్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువకుడు 67వ ర్యాంకు సాధించాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం చిన్న లచ్చపేట గ్రామానికి చెందిన భూస కిరణ్ కుమార్, లలిత దంపతుల కుమారుడు బుస ఉదయ్ కుమార్ గ్రూప్ వన్ లో 67 వ ర్యాంక్ సాధించారు. డీఎస్పీ పోస్టుకు అర్వత సాధించినట్లు ఉదయ్ కుమార్ తెలిపారు. తన తండ్రి విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్లో లైన్మెన్ గా పనిచేస్తుండగా తన తల్లి ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి చెందిన యువకుడు ఉదయ్ కుమార్ డీఎస్పీగా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.