calender_icon.png 18 April, 2025 | 10:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

10వ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన డీఎస్పీ

22-03-2025 02:02:11 AM

ఎల్లారెడ్డి మార్చ్ 21(విజయక్రాంతి) ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని 10వ తరగతి పరీక్షల కేంద్రాలను శుక్రవారం నాడు ఎల్లారెడ్డి డి.ఎస్.పి. శ్రీనివాస్ రావు తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణను సమీక్షిస్తూ, అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా పరీక్షా హాలులో భద్రతా ఏర్పాట్లు, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, ప్రశాంత వాతావరణాన్ని స్వయంగా పరిశీలించారు.విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయలని వారికి శుభాకాంక్షలు తెలిపారు.పరీక్షలు నిష్పక్షపాతంగా సాగేందుకు,ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణం కల్పిచాలని, పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) రవీంద్ర నాయక్, (ఎస్త్స్ర) మహేష్,పోలీసు సిబ్బందితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పరీక్ష నిర్వహణ అధికారులు,సిబ్భంది పాల్గొన్నారు.