calender_icon.png 18 March, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సై సందీప్ కుమార్ ను సన్మానించిన డీఎస్పీ

18-03-2025 06:28:26 PM

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ గ్రూప్ వన్ ఫలితాలలో 502 మార్కులు సాధించి మెరుగైన ర్యాంకు తెచ్చుకున్నందుకుగాను ఇల్లందు డిఎస్పి ఎన్ చంద్ర భాను, ఇల్లందు సిఐ బత్తుల సత్యనారాయణలు మంగళవారం సన్మానించి అభినందనలు తెలిపారు. డిఎస్పి ఎన్ చంద్రబాబు మాట్లాడుతూ... పట్టుదల, కృషి, క్రమశిక్షణతో మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అని ఎస్సై సందీప్ కుమార్ నిరూపించారని, పోలీసు ఉద్యోగం చేస్తూ కూడా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ లో అత్యధిక మార్కులు సాధించడం చాలా అభినందించతగిన విషయం అని కొనియాడారు.

యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా, సెల్ఫోన్లకు, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడకుండా ఎస్సై సందీప్ కుమార్ ని ఆదర్శంగా తీసుకొని యువత మంచి ప్రవర్తనతో ఉండి ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగపర్చుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదగాలని డిఎస్పి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిఎస్పి కార్యాలయం సిబ్బంది ఎస్సై సందీప్ కుమార్ని అభినందించారు.