‘కీ’పై అభ్యంతరాలు స్వీకరించిన పది రోజుల్లో వెల్లడి
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఈ నెలాఖరు కల్లా డీ ఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికా రులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ పూర్తయిన 10 రోజుల తర్వా త ఫలితాలు విడుదల చేయనున్నట్టు అధికారిక వర్గాలు పేర్కొ న్నాయి. ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిం చారు. దాదాపు రెండున్నర లక్షల మంది హాజరయ్యారు. మొ దటి సారిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో పరీక్షలను విజ యవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన కీ ని ఈ నెల 13న విడుదల చేసి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఆ తర్వాత 10 రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా కసరత్తు చేస్తున్నారు.