calender_icon.png 10 January, 2025 | 5:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ పెండింగ్ పోస్టులు భర్తీ చేయాలి

04-12-2024 02:22:18 AM

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): డీఎస్సీ పెండింగ్ పోస్టులను భర్తీ చేయాలని  2024 ఉపాధ్యాయ సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 11,062 టీచర్ పోస్టుల భర్తీలో భాగంగా పెండింగ్‌లో పెట్టిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్, ఉర్దూ మీడియంలో పెండింగ్ ఖాళీలు, స్పోర్ట్స్ కేటగిరీ, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులపై నిర్ణయం తీసుకొని వాటిని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

బ్యాక్‌లాగ్‌లా కాకుండా వీటిని ఇతర మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు.