calender_icon.png 26 November, 2024 | 10:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిబ్రవరిలో డీఎస్సీ?

25-09-2024 03:10:33 AM

  1. ప్రభుత్వ స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు
  2. కొత్త డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీ
  3. కసరత్తు చేస్తున్న విద్యాశాఖ యంత్రాంగం

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): విద్యాశాఖ మరో డీఎస్సీ నోటిఫికేష న్ వేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు ఖాళీల వివరాలను సేకరించే పని లో పడింది. జిల్లాల వారీగా ఎన్ని ఖాళీలున్నాయని లెక్కలు తీస్తోంది. ప్రభుత్వ ఆదే శాలు, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను వేసి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహించేందకు ఇప్పటినుంచే రంగం సిద్ధం చేస్తోంది.

ఐదారు వేల ఉపాధ్యాయ ఖాళీలతో డీఎస్సీ నోటిఫికేషన్ వేయబోతోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈక్రమంలోనే కొత్తగా నోటిఫికేషన్ వేసే డీఎస్సీలో ఈ తరగతులను బోధించే అవసరమయ్యే ఉపాధ్యాయులను నియామక ప్రక్రియ ద్వారా తీసుకోనున్నారు.

అసెంబ్లీలో ప్రకటించినట్టే జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయడంలో భాగంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేయనున్నారు. అయితే, దీని కంటే ముందు టెట్ నోటిఫికేషన్‌ను వేయనున్నారు. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. 

అంగన్‌వాడీల్లో ప్రీప్రైమరీ 

అంగన్ వాడీ సెంటర్లలో ప్రీప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలుండగా, వీటి లో ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో ఉన్న 15,600 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ సెంటర్లలో పనిచేసే వర్కర్లతోపాటు ఈ కేంద్రాల్లో డీఎస్సీ ద్వారా కొత్తగా టీచర్లను నియమించనున్నారు.

అవసరమైన చోట అంగన్‌వాడీ సిబ్బందికి ఇంగ్లిషులో బోధించేలా శిక్షణను ఇచ్చి వారి సేవలను వినియోగించనున్నారు. ప్రభుత్వ పాఠశాల ప్రాంగణాల్లో ఉండే కొన్ని అంగన్‌వాడీ సెంటర్లలో ఇప్పటికే ప్రీప్రైమరీ తరగతులను నిర్వహిస్తున్నారు. రాబోయే విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అందుబా టులో తీసుకొని రానున్నారు.

ఆలస్యంగా డీఎస్సీ ఫలితాలు 

ఈ ఏడాది ఫిబ్రవరి 29న మెగా డీఎస్సీని ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం 5,089 టీచర్ పోస్టులతో జారీచేసిన డీఎస్సీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసి అదనంగా 4,957 టీచర్ పోస్టులు, మరో 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు కలిపి మొత్తం 11,062 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)లు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహించారు. 2,79,957 మంది దరఖాస్తు చేసుకోగా, 2,45,263 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఆగస్టు 13న ప్రిలిమినరీని విడుదల చేయగా, ఈ నెల 6న తుది కీ విడుదల చేశారు. తుది కీపై న అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా రు.

జీఆర్‌ఎల్ విడుదలలో అధికారులు ఆలస్యం చేస్తున్నారు. 1:3 మెరిట్ జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టి నియమాక పత్రాలు అందజేస్తారు. ఈ ప్రక్రియ ముగిశాక ఖాళీలకు అనుగుణంగా డీఎస్సీని వేయను న్నారు. అయితే డీఎస్సీ ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నాయి. ఈనెల చివరి వరకు ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.