హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): నేటి నుంచి డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పోస్టులు పెంచి డీఎస్సీని వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా అభ్యర్థులు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. అయినా కానీ, డీఎస్సీని షెడ్యూల్ ప్రకారం నిర్వహించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపింది.ఈనెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.