calender_icon.png 1 October, 2024 | 3:25 AM

నేటి నుంచి డీఎస్సీ సర్టిఫికేషన్ వెరిఫికేష్

01-10-2024 02:06:01 AM

1: 3 నిష్పత్తిలో అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ఈనెల 5 వరకు కొనసాగనున్న ప్రక్రియ

1:1 జాబితా విడుదల తర్వాత అభ్యర్థులకు నియామకాలు

వెబ్‌సైట్‌లో అందుబాటులో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్

హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): డీఎస్సీ-2024 ఫలితాలను ప్రభు త్వం సోమవారం విడుదల చేసింది. నేటి నుంచి డీఎస్సీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను చేపట్టనున్నారు. ఈనెల 5వ తేదీ వరకు దీన్ని పూర్తి చేస్తారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

మొత్తం 11,062 పోస్టులుండటంతో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అంటే దాదాపు 33 వేలకుపైగా అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ఏ జిల్లాలకు ఆ జిల్లాల్లో ఈ ప్రక్రియను జిల్లా విద్యాధికారులు చేపట్టనున్నా రు. డీఈవోలచే జాబితా ధ్రువీకరణ తర్వాత 1:1 జాబితా రూపొందిస్తారు.

ఇది తుది జాబితా అవుతుంది. అనంతరం ఎంపికైన అభ్యర్థుల నుంచి జిల్లా కలెక్టర్ వెబ్ ఆప్షన్లు తీసుకొని, చివరగా ప్రభుత్వం నియామక ఉత్తర్వులు జారీ చేస్తోంది. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో అభ్యర్థులకు నియామక పత్రాలను సీఎం స్వయంగా అందజేయనున్నారు. జిల్లాల వారీగా టాప్ ర్యాంకుల వివరాలను అధికారులు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

ఎస్జీటీకు టాప్ స్కోర్ ఎంత, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ సబ్జెక్టుల వారీగా ర్యాంకుల వివరాలను ప్రకటిం చారు. కొత్తగా రిక్రూట్ అయిన టీచర్లు అక్టోబర్ నెలాఖరు కల్లా బడులకు వచ్చే అవ కాశం ఉంది. మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకు ఈ ఏడాది ఫిబ్రవరి 29న విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

డీఎస్సీ పరీక్షకు ముందు మరింత మందికి అవకాశం కల్పించేందుకు టెట్ నిర్వహించింది. అనంతరం ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 26 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహించారు. మొత్తం 2,79,838 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2,46,584 (88.11 శాతం) మంది హాజరయ్యారు.

ప్రాథమిక కీని ఆగస్టు 13న విడుదల చేయగా, ఆగస్టు 20 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి, సెప్టెంబర్ 6న ఫైనల్ కీని విడుదల చేశారు. అయితే ఫైనల్ కీలోనూ తప్పులున్నాయని కొంత మంది అభ్యర్థులు ఆధారాలతో సహా అధికారులకు ఫిర్యాదులు చేయగా, వీటిపై నిపుణుల కమిటీ  పరిశీలించి ఫలితాలను అధికారులు విడుదల చేసినట్లు తెలిపారు. తమ అభ్యంత రాలకు మార్కులు కలపలేదని అభ్యర్థులతు తెలిపారు.

డీఎస్సీ వివరాలిలా...

  1.  డీఎస్సీ నోటిఫికేషన్: 2024, ఫిబ్రవరి 29
  2.  మొత్తం పోస్టులు: 11,062
  3. స్కూల్ అసిస్టెంట్ (ఎస్‌ఏ): 2,629
  4. భాషా పండితులు (ఎల్పీ): 727
  5. వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు (పీఈటీ): 182
  6. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ): 6,508
  7.  స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 220
  8. సెకండరీ గ్రేడ్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 796
  9. డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు: 2,79,838
  10. రాత పరీక్షకు హాజరైన వారు: 2,46,584 (88.11 శాతం)