calender_icon.png 16 January, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్ తర్వాతే డీఎస్సీ నియామకాలు!

08-08-2024 01:08:29 AM

ఉపాధ్యాయ దినోత్సవం నాటికి   అపాయింట్‌మెంట్ ఆర్డర్లు కష్టమే

హైదరాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఇటీవల నిర్వహించిన డీఎస్సీలో ఎంపికైన వారికి నియామకపత్రాలు ఇచ్చేందుకు సమ యం పట్టనుంది. సెప్టెంబర్ 5 నాటికి నియామకపత్రాలను ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఆ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్టు తెలుస్తోంది. జులై 26న సచివాలయంలో పలు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ప్రభుత్వ పెద్దలు నిర్వహించిన సమావేశంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో అభ్యర్థులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక వర్గాలు స్పష్టత ఇచ్చాయి.

పరీక్ష ఫలితాలను వెలువరించి, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చేందు కు కాస్త సమయం పడుతుందని తెలిపాయి. 11,062 ఉపాధ్యాయ పోస్టులకు జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు మొత్తం 26 పరీక్షలు జరిగాయి. వీటికి సబంధించి ప్రాథమిక కీని శుక్రవారం విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కీ విడుదల చేయడం, దీనిపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ, తుది కీ విడుదల చేసి చివరకు ఫలితాలను విడుదల చేయాల్సి ఉంటుంది. దీనంతటికి కాస్త సమయం పడుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం నాటికి నియామక పత్రాలు ఇవ్వడం సాధ్యంకాదని, సెప్టెంబర్ తర్వాతే డీఎస్సీ కొత్త టీచర్లు రానున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.