ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం
నిజామాబాద్, ఆగస్టు ౩ (విజయక్రాంతి): నిజామాబాద్ అభివృద్ధిలో మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పాత్ర మరువలేనిదని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. డీఎస్ కుమారుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ విజ్ఞప్తి మేరకు నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో డీఎస్ విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. శనివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో డీఎస్‌కు సభ్యులు శ్రద్ధాంజలి ఘటించారు. డీఎస్‌ను గౌరవించుకోవడం తమ కనీస కర్తవ్యంగా భావించి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానినికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, మునిసిపల్ కమిషనర్ మంద మకరంద్, అధికారులు పాల్గొన్నారు.