16-04-2025 01:55:17 AM
మహబూబాబాద్, ఏప్రిల్ 15 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా డిఎస్ రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది.
ఈ సందర్భంగా నూతన కమిటీని ఎందుకున్నారు. అధ్యక్షునిగా డిఎస్ రవిచంద్ర, ప్రధాన కార్యదర్శిగా మేకపోతుల శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షునిగా ఓలం కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. పూర్తి కార్యవర్గాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామని జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర తెలిపారు. వరుసగా మరోసారి ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా ఎన్నికైన రవిచంద్రను పలువురు అభినందించారు.