26-02-2025 12:23:02 AM
సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) :- నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలో సుమారు రెండు లక్షల ఎకరాలలో మొక్కజొన్న, వరి, మిరప, పెసర తదితర పంటలు సాగు నీరందక ఎండుతున్నాయని, పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఇక్కడ జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం లో అయన మాట్లాడారు.
ముఖ్యంగా మొక్కజొన్న పంట ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేశారని, గింజ దశకు చేరిందని, సకాలంలో నీళ్ళు అందకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఎడమ కాలువ పరిధిలో వైరా నుండి దిగువకు గోదావరి జలాలను యుద్ధ ప్రాతిపదికపై సాగర్ కాల్వకు అనుసంధానించి పంటలను కాపాడాలన్నారు.
గత సంవత్సరం ఆగస్టులోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించినా, ఇంత వరకు సీతారామ ప్రాజెక్టును అనుసంధానం చేయలేకపోవటం ప్రభుత్వ యంత్రాంగం యొక్క అసమర్థతకు నిదర్శనం అన్నారు.