calender_icon.png 4 April, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వట్టిపోతున్న బోర్లు ఎండిపోతున్న పంటలు

03-04-2025 12:00:00 AM

  1. పంటలు దక్కించు కొనేందుకు  తంటాలు  పడుతున్న రైతన్నలు
  2. జిల్లాలో వ్యవసాయ బో ర్ల కింద అన్నదాతల హరిగోస
  3. జిల్లాలో చివరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్లతో పంటలకు నీళ్లు పెడుతున్న రైతులు

కామారెడ్డి, ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): భూగర్భ జలాలు రోజురోజుకు ఇంకిపోతుండడంతో వ్యవసాయ బోరు బావులు ఎండిపోయి నీళ్లు రాక పట్టిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట పండించేందుకు ప్రయత్నిస్తున్న రైతులకు భూగర్భ జలాలు ఇంకిపోవడం తో రైతులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు.

మరో 15 నెల రోజుల్లో వరి పంట గట్టి ఎక్కుతుందని భావించిన రైతులకు  భూగర్భ జలాలు ఇంకిపోవడంతో వ్యవసాయ బోర్లు వట్టి పోవడంతో రైతులు నోటికాడికి వచ్చిన పంట ఎండిపోతుండడంతో ఇన్ని రోజులు కష్టపడి పెట్టుబడులు పెట్టిన పంట తమ కళ్ళముందే ఎండి పోవడం రైతులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నాయి.

విత్తనాలు మొదలుకొని వారి నాటు వేయడం మందులు చల్లడం కలుపు తీయడం వంటి పనులు చేపట్టి పెట్టుబడి పెట్టిన రైతులకు భూగర్భ జలాలు ఒకేసారి ఇంకిపోవడంతో వ్యవసాయ బోర్లు నుంచి నీరు రాకపోవడంతో చివరి సమయంలో వరి పంటను దక్కించుకునేందుకు రైతులు డబ్బులకు లెక్కచేయకుండా ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి వరి పంటకు పడుతున్నారు.

రాత్రి వేళలో ట్యాంకర్ల లో నీటిని నింపుకొని వ్యవసాయ పొలం వద్దకు తెచ్చి ట్యాంకర్ల ద్వారా నీటిని పారిస్తున్నారు. మరోవైపు నిద్రలేని రాత్రులు రైతులు గడుపుతున్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి సబ్ డివిజన్ల పరిధిలో వరి పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు.

కామారెడ్డి జిల్లా బిక్క నూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన అల్లాడి బాలచంద్రం, అల్లాడి కృష్ణమూర్తి లకు చెందిన వ్యవసాయ బోర్లు వ ట్టి పోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ ము లోని రైతులు పంటలు ఎండిపోతుండడంతో ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా వరి పంటను కాపాడుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు.

వ్యవసాయ అధికారులు రెవిన్యూ అధికారులు ప్రజా ప్రతినిధులు ఎండుతున్న పంటలను పరిశీలించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకొని ఎండుతున్న పంటలను కాపా డాలని రైతులు కోరుతున్నారు. లేకుంటే పెట్టిన పెట్టుబడులు నష్టపోవడమే కాకుండా అప్పులు తెచ్చి పంట సాగు కోసం పెట్టుబడు లు పెట్టగా భూగర్భ జలాలు ఇంకిపోవడంతో నష్టపోతున్నట్లు రైతులు ఆందోళన చెందుతున్నారు.

చేసేది ఏమీ లేక మరి కొంతమంది రైతులు పశువులకు మేతకు వరి పంటను కోత కోసి పెడుతున్నారు. మరికొందరు ఎండిన వరి పంట పొలాలో పశువులను మేపుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని భిక్కనూర్, దోమకొండ, బీబీపేట్ మాచారెడ్డి, పల్వంచ, రామారెడ్డి, రాజంపేట, మండలాలతో పాటు పలు గ్రామాలలో పరిపంటలు ఎండుతున్నాయి.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివ నగర్, గాంధారి, తాడువాయి, లింగంపేట్, మండలాల్లో ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి వ్యవసాయ బోర్లు  వట్టిపోతున్నాయి. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం ఇప్పించేలా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు కృషి చేయాలని రైతులు కోరుతున్నారు. వేలాది ఎకరాల పంటలు ఎండిపోయాయి.

వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా వారు ఉన్నచోట నే కొంతమంది రైతులని అడిగి వివరాలను ట్యాబ్ల్లో నమోదు చేస్తున్నారు. రైతులు నష్టపోయిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కొండంత నష్టం పోతే గోరంత నష్టం జరిగిందని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండానే ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు నివేదికలు తయారు చేసి పంపిస్తున్నారని రైతుల ఆరోపిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలను నమోదు చేస్తున్నారు

కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాలు ఇంకిపోవడంతో చాలా వ్యవసాయ బోర్లు వట్టి పోయాయి. క్షేత్రస్థాయిలో ఉన్న ఏఈవోలు పూర్తి వివరాలను ట్యాబ్ లలో నమోదు చేసి వివరాలు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఎక్కడైనా తప్పుడు రిపోర్టులు ఇస్తే రైతులు ఫిర్యాదు చేయాలని అధికారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తిరుమల ప్రసాద్,

జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్,

కామారెడ్డి