12-04-2025 01:13:11 AM
హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్ ఆర్) సమీపంలో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా డ్రైపోర్ట్ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని ఐసీసీసీలో శుక్రవారం రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మా ణం, ఆర్‌ఆర్‌ఆర్ పనుల పురోగతిపై సం బంధితశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడారు.
ఇటీవల పునర్విభజన అంశాలపై ఢిల్లీలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వా లతో సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో హైదరాబాద్-- విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే డీపీఆర్‌కు సూత్రప్రాయంగా ఆమోదం తెలపాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆదేశించారని, ఈ నేపథ్యంలో ఆయాశాఖలు హైవే పనులపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ పూర్తిచేయాలని, దక్షిణ భాగం డీపీ ఆర్ కన్సల్టెన్సీ నివేదికను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ రాయ్‌పూర్ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు పంపించాలని సూచించారు.
అలాగే హైదరాబాద్ - మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులపై సీఎం ఆరాతీశారు. ప్రతిపాదిత స్థలాల్లో పలు చోట్ల పంటలు ఉన్నాయని, పంట నష్టపరిహారం చెల్లించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ అంగీకరించడం లేదని అధికారులు వాపో యారు.
ప్రస్తుతం పంట కాలం పూర్త య్యే సమయం వచ్చినందున అధికారులు వెంటనే రైతుల వద్దకు వెళ్లి, వారితో మాట్లాడి భూసేకరణ చేపట్టాలని సూచించారు. ఏవైనా సమస్య లుంటే జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమీక్షలో ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్రప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి, ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రత్యేక కార్యదర్శి హరిచందన, ఇంజినీరింగ్‌శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.