కామారెడ్డి,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని టేకిరియాల గ్రామ శివారులో శనివారం 44వ జాతీయ రహదారిపై వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీలో ముగ్గురు అనుమానాస్పద వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంకు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు దేవునిపల్లి ఎస్ఐ రాజు తెలిపారు. వారి వద్ద నుంచి 110 గ్రాముల ఎండు గంజాయి, మూడు సెల్ ఫోన్లు, ఒక బైకు సీజ్ చేశారు. గంజాయిని విక్రయించేందుకు వస్తుండగా పట్టుబడినట్లు తెలిసింది. ఎన్డీపీఎస్ యాక్ట్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు పేర్కొన్నారు.