calender_icon.png 19 April, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బహదూర్ పల్లి అయోధ్య విల్లాల్లో తాగుబోతుల హల్ చల్.. చికిత్స పొందుతున్న సెక్యూరిటీ గార్డు

18-04-2025 10:35:24 PM

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్ పల్లి అయోధ్య విల్లాల్లో తెల్లవారుజామున 5:17 నిమిషాలకు సెక్యూరిటీ గార్డు ను విచక్షణారహితంగా చితకబాది నిందితులు పరారైన సంఘటనలో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీస్ లు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. పోలీసులు,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున సుమారు 5:17 నిమిషాలకు AP 28 BU 6886  కారులో వచ్చిన నిందితులు మన్నే గణేష్, వారాల అజయ్ మరికొందరు తాగిన మైకంలో వేగంగా వచ్చి అయోధ్య విల్లాల్లో ఉన్న TS 08 JA 3933 కారును బలంగా ఢీ కొట్టడంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు దిలీప్(55) అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతనిని పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్ని విచక్షణారహితంగా దాడిచేసినట్లు సమాచారం. కాలనీ వాసులు, బాధితుని భార్య పూల్ బాయ్ దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ 404/2025, అండర్ సెక్షన్ 126,281 115(2),351(2),292 రెడ్ విత్ 3(5) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బాధితుడు బహదూర్ పల్లి లోని ఎస్ వి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.