బాధితుడి పరిస్థితి విషమం
మేడ్చల్, సెప్టెంబర్18: మద్యం మత్తులో ఓ వక్తి ఇద్దరితో వాగ్వాదానికి దిగగా అది భౌతిక దాడికి దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ మున్సిపాలిటీ కిష్టాపూర్‌లో బీహర్‌కు చెందిన పవన్, సంతోష్ అద్దెకుంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన వీరి మిత్రులు రంజిత్, విజయేంద్ర సందీప్ .. స్థానికంగా ఓ సీడ్ కంపెనీలో పనిచేస్తున్నారు. బుధవారం నలుగురు కలిసి మద్యం తాగుతుండగా వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఒక వ్యక్తి కత్తితో సంతోష్ గొంతు కోయడంతో పాటు పవన్ తలపై దాడి చేశాడు. సంతోష్‌ను గాంధీ ఆసుపత్రికి తరలించగా అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నలుగురిలో దాడికి పాల్పడిం ది విజయేంద్ర సందీప్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.