66 వాహనాలు సీజ్
ఎస్పీ సింధూశర్మ...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంగళవారం అర్దరాత్రి వాహనాల తనిఖీలను చేపట్టగా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యాక్రమంలో 110 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ సింధూశర్మ తెలిపారు. మధ్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. నూతన సంవత్సర దినోత్సవ వేడుకల్లో భాగంగా అర్దరాత్రి వాహనాల తనిఖీలు చేపట్టగా మధ్యం సేవించి వాహనాలు నడుపుతున్న 110 మంది జిల్లా వ్యాప్తంగా పట్టుబడినట్లు తెలిపారు. 66 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 60 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఎల్లారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 28, బాన్సువాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో 22 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 66 వాహనాలను మధ్యం సేవించి నడపడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఇకపై కూడా ఎవరు మధ్యం తాగి వాహనాలను నడపరాదని తెలిపారు. రహదారి భద్రత నియమ నిబంధనలను పాటించి ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గే విధంగా పోలీస్‌శాఖ తీసుకునే చర్యల్లో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.