calender_icon.png 19 April, 2025 | 5:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో తాగుబోతుల హల్ చల్

18-04-2025 07:01:25 PM

కారు అద్దాలు ధ్వంసం చేసిన తాగుబోతులు

అడ్డుకున్న సెక్యూరిటీ గార్డును చితకబాది, పిడిగుద్దులు గుద్ది పారారైన దుండగులు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): మద్యం మత్తులో తాగుబోతులు హల్ చల్ చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహదూర్ పల్లి అయోధ్య విల్లాల్లోకి శుక్రవారం తెల్లవారుజామున 5 గంటలకు తాగుబోతులు చొరబడి కారు అద్దాలు ధ్వంసం చేశారు. అడ్డుకున్న నేపాల్ కు చెందిన సెక్యూరిటీ గార్డును చితకబాది ఇష్టానుసారంగా పిడి గుద్దులు గుద్ది కాళ్ళతో తన్ని పారారయ్యారు. అడ్డు వచ్చిన మహిళలు, స్థానికులను భూతులు తిడుతూ విరుచుకుపడ్డారు.

డ్రగ్స్ తీసుకొని హల్ చల్ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.దుండగులు సూరారం కాలనీకి చెందిన మన్నే బాలేష్, వారాల నర్సింహ వారసులు అజయ్, నితిన్, లాలూ, తిరుమలేష్ గా సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.అయోధ్య విల్లాల్లో ఉండే కాలనీ వాసులు, మహిళలు భయాందోళనకు గురవుతున్నారు.సెక్యూరిటీ గార్డును విచక్షణారహితంగా చితకబాదడంతో సెక్యూరిటీ గార్డు అసోసియేషన్ సభ్యులు ఏకమవుతున్నారు. దుండగులను కఠినంగా శిక్షించాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.