22-04-2025 12:00:00 AM
త్రుటిలో తప్పిన ప్రమాదం
కార్వాన్, ఏప్రిల్ 21: ఓ వ్యక్తి మద్యం మత్తులో పివిఎన్‌ఆర్ ఎక్స్ప్రె స్ వే ఫ్లైఓవర్ నుంచి కిందికి దూకా డు. వెంటనే స్థానికులు అప్రమత్తమై అతడిని రక్షించారు. లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సోమవారం వైరల్ గా మారాయి. స్థానికుల కథ నం ప్రకారం.. పిల్లర్ నెంబర్ 100 దగ్గర ఏవీఎన్‌ఆర్ ఎక్స్ప్రెస్ వే పైకి ఎక్కిన ఓ వ్యక్తి మద్యం మత్తులో తీగలను పట్టుకొని కిందికి వేలాడాడు.
అతడిని స్థానికులు గమనించి సముదాయించారు. వెంటనే ఓ కారు కవ ర్‌ను కింద జాగ్రత్తగా పట్టుకోవడం తో అతడు దానిలో దూకడంతో క్షే మంగా బయటపడ్డాడు. అనంతరం అతడు అక్కడి నుంచి వెళ్లిపోయా డు. ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం అందలేదని లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ రఘుకుమార్ సో మవారం రాత్రి తెలిపారు.