calender_icon.png 9 February, 2025 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

268 డ్రంకెన్ డ్రైవ్ కేసులు

09-02-2025 01:05:37 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శుక్రవారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్‌లో 268 కేసులు నమో దు చేసినట్టు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. 223 టూవీల ర్లు, 10 త్రీ వీలర్లు, 33 ఫోర్ వీలర్లు, 2 ట్రక్ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నట్టుగా గుర్తించారు.

ఈ డ్రైవ్‌లో 33 మంది వాహనదారులకు బీఏసీ రేంజ్ 200 ఎంజీ / 100 ఎంజీ నుంచి 550 ఎంజీ/100 ఎంజీ వరకూ నమోదు అయినట్టు పేర్కొన్నారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హజరుపర్చారు. 10 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.