calender_icon.png 8 January, 2025 | 10:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్

03-01-2025 12:00:00 AM

కారుఢీకొని మహిళ మృతి

నాగర్‌కర్నూల్ జనవరి 2 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రధాన రహదారిపై కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అతివేగంతో డివైడర్‌ను ఢీకొని గాల్లో ఫల్టీలు కొడుతూ రోడ్డుపై వెళ్తున్న మహిళను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్దునూరులో బుధవారం ఈ ఘటన జరగ్గా, గురు వారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎస్‌ఐ గోవర్ధన్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన భోగరాజు లక్ష్మమ్మ(45) బుధవారం ఉద యం పాలకోసం బయటకువచ్చి తిరిగి ఇంటికి వెళ్తోంది. ఈ క్రమం లో బల్మూరు మండలం పోలేపల్లికి చెందిన రమేశ్ నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్‌కు కారులో వెళ్తు న్నాడు. అతివేగం కారణంగా డివైడర్‌ను ఢికొట్టడంతో కారు గాల్లో ఫల్టీలు కొట్టి పక్కనే ఉన్న లక్ష్మమ్మను ఢీకొంది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, రమేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.