అర్ధరాత్రి మద్యం తాగి రోడ్డు ఎక్కి, పట్టుబడిన 282 మంది మందు బాబులకు జరిమానా
మద్యం సేవించిన వాడు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన పోలీసులు..
మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండండి...
జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో మీ వంతు సహకారం అందించండి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్
సంగారెడ్డి (విజయక్రాంతి): నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు రోజులుగా జిల్లా యంత్రాంగం అంతా కట్టుదిట్టమైన భద్రత పరమైయాన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ వివరించారు. బుధవారం సంగారెడ్డి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు. 31 డిసెంబర్ నాటి అర్ధరాత్రి మద్యం తాగి రోడ్డు ఎక్కి వాహనాలు నడిపిన 282 మంది మందుబాబులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, జైలుకు తరలించడం జరుగుతుందన్నారు.
వాహనాల తనిఖీలు సంవత్సరం పొడవుతున్న ఉంటాయని, ప్రజలు ఎవ్వరు కూడా ట్రాఫిక్ నియమాలను ఉల్లంగించకూడదని, బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను పాటించవలసిందిగా జిల్లా ప్రజలను కోరారు. అదేవిధంగా ట్రాఫిక్ నియమనిబంధనలను ఉల్లంగించి, వాహనాలు నడిపిన వారికి జరిమానాతో పాటు, జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ కొన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. అందులో సైబర్ నేరాల గురించి మాదకద్రవ్యాల దుర్వినియోగం గురించి ట్రాఫిక్ నియమాల గురించి, ఉమెన్ సేఫ్టీ గురించి జిల్లాలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి గాను స్పెషల్ టీంను ఏర్పాటు చేయడం జరుగుతుందని, తద్వారా జిల్లా ప్రజలలో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం విషయమై సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖలో ఇప్పటికే ఏర్పాటు చేసిన S-Nab ద్వారా సత్ఫలితాలను రాబట్టడం జరిగిందని. అదేవిధంగా ఈ S-Nab పనితీరు మరింత మెరుగుపరిచి జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చడంలో కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ అన్నారు. అదేవిధంగా మీ చుట్టూ ఏవైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే వెంటనే సంగారెడ్డి జిల్లా నార్కోటిక్ అనాలసిస్ బ్రాంచ్ నెంబర్ 871265677 కు సమాచారం అందించవలసిందిగా జిల్లా ప్రజలను కోరడం జరుగుతుంది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.